కొబ్బరిచెట్ల నడుమ కొలువైన నరసింహ క్షేత్రం, అంతర్వేది
పరవళ్లు తొక్కే గోదావరి నది మీద ప్రయాణం చేసి అంతర్వేది చేరవచ్చు. చాలా పురాతనమైనది. ఇక్కడ ఆలయంలో స్వామి శ్రీలక్ష్మీనరసింహాస్వామి. స్పష్టంగా వినిపించే సముద్రహోరు, గోదావరి సముద్రంలో కలిసే చోటు కన్నులారా చూడవచ్చు. సముద్రపు నీరు, గోదావరి నీరు రెండు విడివిడిగా పారు తుంటాయి. ఆ ప్రదేశాన్నే అన్నా చెల్లెళుల గట్టు అంటారు. లక్షలాది యాత్రికులని రప్పించుకునే ఈ స్వామికి ఉత్సవాలు, రథోత్సవాలు జరుగుతాయి. పశిష్ఠగోదావరి సంద్రంలో కలిసే సాగరసంగమస్థలం ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాల వేద ఘోష చుట్టూ పచ్చగా తలలూపుతూ కనిపించే కొబ్బరిచెట్ల నడుమ కొలువైన నారసింహ క్షేత్రం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మాఘమాసంలో ఆ స్వామికి జరిగే కల్యాణోత్సవం సందర్భంగా అంతర్వేది క్షేత్రం గురించి కొన్ని విశేషాలు. త్రేతాయుగంలో రావణబ్రహ్మను సంహరించిన శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి దర్శిం చుకున్న క్షేత్రం ద్వాపరయుగంలో అర్జునుడు తీర్థయాత్రకు వెళ్తూ ఆగిన తీర్థం అంతర్వేది. వశిష్ఠ మహర్షి కోరికపై శ్రీమహావిష్ణువు ధర్మపత్నీ సమేతంగా వెలసిన పుణ్యస్థలి. ఏటా మాఘమాసంలో రథసప్తమి పర్వదినంతో ప్రారంభమై పదిరోజుల పాటు ఈ క్షేత్రంలో జరిగే అణువణువునా భక్తి భావం వెల్లువై పొంగుతుంది. నారసింహ జయజయ ధ్వానాలతో ఈ క్షేత్రం మారుమోగుతుంటుంది.
ఆలయనిర్మాణం
శాసనాల ద్వారా తెలుస్తున్న వివరాల ప్రకారం పూర్వం మందపాటి కేశవదాసు అనే పశువుల కాపరి అంతర్వేది ప్రాంతంలో గొడ్లు కాసుకుంటుంటే ఒక ఆవు అక్కడ పుట్టలో పాలధారలు విటవటం చూసి భయపడ్డాడు. ఆ రోజు రాత్రి నరసింహస్వామి అతని కలలో కనిపించే తానుండే ప్రదేశం గురించి చెప్పడంతో అతను గ్రామస్థుల్ని కూడగట్టుకుని పుట్టను తవ్విచూడగా విగ్రహం లభ్యమైంది. అప్పుడు కేశవదాసు స్వామికి చెక్కలు, కర్రలతో మందిరం నిర్మించాడట. అనంతర కాలంలో సప్తసాగర యాత్రకు వచ్చిన రెడ్డిరాజులు జాతి దారువుతో ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని బెండమార్లంకకు చెందిన కొపనాతి ఆదినారాయణ కుమారుడు కృష్ణమ్మ క్రీ.శ.1823లో నిర్మించి నట్లు శాసనాలు చెబుతున్నాయి. తొలుత పెద్దాపురం సంస్థా నాధీశుల అధీనంలో ఉన్న ఆలయం తర్వాత మొగల్తూరు రాజుల అజమాయిషీలోకి వచ్చింది. స్వామివారికి ఆయా సంస్థానాధీశులు, ఆలయనిర్మాణ సమకూర్చిన బంగారు దివ్యా భరణాలు చాలానే ఉన్నాయి. వీటిని రాజోలు ఉపఖజానాలో భద్రపరిచారు. ఏటా కల్యాణోత్సవ సమయాని శ్రీస్వామి, అమ్మవార్లకు వాటిని అలంకరిస్తారు. వీటిలో కిరీటం, వైరు ముడి, కంఠె, శఠగోపం, మొహరీల దండ, పచ్చలపతకం, ముత్యాల పతకం తదితర ఆభరణాలు ఉన్నాయి. కల్యాణం జరిగిన మర్నాడు దివ్యరథంపై స్వామివారిని ఉభయ దేవేరు లతో ఊరేగించడం సంప్రదాయంగా వస్తోంది. రథంపై కొలువ్ఞ తీరిన దివ్యమూర్తులను గుర్రాలక్కమ్మ గుడి వరకు తీసుకు వెళ్తారు. స్వామి తన సోదరి అయిన గుఆలక్కమ్మకు సారె, చీర పెట్టన వైనాన్ని ఆద్యంతం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
నర్సన్న కల్యాణమైతేనే
ఏటా మాఘమాసంలో అంతర్వేది నృసింహ స్వామి కల్యాణం అయిన తర్వాతనే స్థాని కంగా పెళ్లిళ్లు జరుగు తుంటాయి. మాఘ మాసంలో స్వామివారి కల్యాణానికి ముందు ఎంత మంచి ముహూ ర్తం ఉన్నా పెట్టుకోరు. ఇది అనాదిగా సంప్రదాయంగా వస్తోంది.
స్థానిక పల్లిపాలెం గ్రామంలో అయితే 80 శాతానికిపైగా నృసింహ నామ ధేయులే కనిపించడం విశేషం. స్వామివారి కటాక్షం ఉన్నంతవరకూ ఏ ఉపద్రవాలూ తమ దరిచేరవని స్థానికుల నమ్మకం. ప్రపంచ వాస్తంగా సునామీ బీభత్సం చేసిన సమయంలోనూ ఈ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉండటానికి నరసింహుడి దయే కారణమంటారు.
ఈ క్షేత్రంలో కనిపించే మరో విశేషం. ఏటా మాఘమాసంలో కొద్దిరోజులపాటు సూర్యాస్తమయ సమయంలో కిరణాలు గర్భ గుడిలోని స్వామి వారి పాదాలను తాకడం. ఆ దృశ్యాన్ని చూసి భక్తులు పులకించిపోతారు. ఇంకా, ఈ క్షేత్రంలో చూడ దగ్గ విశేషాలు చక్రపెరుమాళ్ విగ్రహం, వశిష్ఠ సేవాశ్రమం, బ్రిటిషర్లు నిర్మించారని చెప్పే లైట్‌హౌస్. ఆలయానికి సమీపంలోనే ఉన్న విశిష్ట సేవాశ్రమంలో సప్తరుషుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. పక్కనే గురుపుత్ర విశ్వవిద్యాలయం, మాతా శిశు సంరక్షణాలయం, గౌతమి గోయజ్ఞ పరిరక్షణ, పరిశోధ నాలయాలు కూడా ఉన్నాయి.
Leave a Reply