భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచించండి భారతీయులారా
” Black Money “ ఇదే మనదేశాన్ని అభివృద్ధి వైపు సాగనివ్వకుండా అడ్డుకుంటున్న పెనుభూతం…
మనలో కొందరికి ఎప్పుడు అర్థం అవుతుందో నాకు అర్థం కావడం లేదు…
ప్రతీ రాజకీయ నాయకుడు మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని సేవ అనే ముసుగు కప్పుకుని కోట్లాది కోట్లను దోచేస్తున్నంత కాలం ఈ పేద కడుపుల ఆకలి తీరదు.
ప్రజలకు సేవ చేయాలనుకునే వాడు ఎలాగైనా చేయగలడు కొందరు మాత్రం కేవలం రాజకీయాన్ని మాత్రమే వాడుకుంటున్నారు.
ఎందుకంటే అవసరమైన చోట రాజభోగం అంతులేని అవినీతి సంపాదన. వందల కోట్లను దోచేసి విలాసజీవితం గడుపుతున్నారు…
ఓట్లు వేసి గెలిపించే మనలొ కొందరికి మాత్రం ఇదేమి తెలియటం లేదు…
ఆ ఎలక్షన్ ముందు రోజు ఇచ్చే 500 నోటుకు ఒక మద్యం బాటిల్ కె దేశాన్నే అమ్మేస్తున్నారు
ఓటుకునోటు తీసుకునే వాడు బిక్షగాడికె బిక్షగాడు నా దృష్టిలొ…
ఓటుకి 500 తీసుకుంటే రోజుకి లెక్కగడితే 27 పైసలు అవుతుంది. 27 పైసలు బిక్షగాడికి వేస్తె మన ముకానె కొట్టిపోతాడు బిక్షగాడు ముకాన కొట్టేంత తీసుకునేవాడు బిక్షగాడి కాలి గోటితో సమానం. ఈ సంగతి కూడా మనలో కొందరికి అర్థం కావడం లేదు….
మనకు ఓటు నోటు అని ఎర వేస్తున్నారు ఏం….? ఎందుకు అంతగా ఆరాటం ఈ రాజకీయ నాయకులకు…
ఎందుకు అంత డబ్బు జనాల మీద జిమ్ముతూ.. పదవి కోసం పోరాటం…. చేస్తున్నారు అని ఏ ఒక్క సామాన్య వ్యక్తి అయినా ఆలోచిస్తున్నాడా?
ప్రతీ పనిలోనూ లంచం… లంచం..
రోడ్డు పనిలో లంచం…
నీటి పథకాల్లో లంచం…
కాంట్రాక్టర్ల లంచం…
మొత్తం అవినీతి మయం…
ఓక్కసారి ఆలోచించండి..
ఒక వ్యక్తి ఒక రోజు కష్టపడి పని చేస్తే ఇప్పుడున్న వేతనం 500…
ఒక నెలకు 15000…సంపాదన
ఒక నెలకు ఖర్చు 10000 అనుకుందాం.. మిగిలిన 5000 జమ….
అదేవిధంగా ఒక MLA కి నెలకు 40000+వాహనం +ఇంధనం..
ఇది ప్రభుత్వం వారికి నియమించిన జీతభత్యాలు..
ఖర్చు….?
సంపాదన…. Unlimited
ఈ నలభై వేలు కారు కోసమేనా… ప్రతీ ఓటుకు వెయ్యి…
రెండు వేలు చొప్పున మనల్ని కొనేస్తున్నారు…
ఇంక తెలుసుకోలేరా….
ఎక్కడినుంచి వస్తుంది ఇంతింత డబ్బు..
అంతకు ముందు లేని ఆస్తుల… డబ్బు.. తరువాత ఎక్కడినుంచి వస్తున్నాయ్…
వందలకోట్లలొ స్తలాలని కార్యాలని ఖర్చులు …
కేజిలకొద్ది బంగారం కట్టలు మూలుగుతున్న నల్లదనం
ఎక్కడినుంచి వస్తున్నాయి ఇన్నింటికి డబ్బులు??
ఎన్నొ కోట్లప్రజల పొట్టలు కొట్టి సంపాదించిన సంపాదనే ఇదంతా…..
దేశంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు… ఏ ఒక్క రోజు వారి ఆకలి తెలుసుకోలేని మనసు లేని మృగాలు కొందరు మన ప్రజా ప్రతినిధులు…
ఇలాంటి మృగాలకు ఆకలంటే ఏంటో రుచి చూపించడానికి మన ప్రధాని గారు వేసిన ఒక్క అడుగే…. ఈ పెద్ద నోట్ల నిషేధం…
దీన్ని సామాన్య ప్రజలకు కొంత వరకూ ఇబ్బంది కలిగించినా… మున్ముందు మన మంచికే…
ఇది నిజం…..
ఓర్పుతో కొంచెం ఓపిక చేసుకుని సర్దుకుని స్వీకరించి మన కడుపు కాలినా పరవాలేదు మృగాలకి కూడా ఆకలంటే ఏంటో తెలిసే లా చేయడమే మన కర్తవ్యం ఇది ఈ రోజు కే కాదు మన భావితరాలకి కూడా ఎంతో శ్రేయస్కరం…..ఆలోచించండి మిత్రులారా
మరి మీరు వ్యతిరేకిస్తున్నారా?? ఏకీభవిస్తున్నారా…??.
Leave a Reply