తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రుడి భవనం..ఇంద్రభవనమే..!
తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు క్యాంపు కార్యాలయం సకల సదుపాయాలతో ఇంద్ర భవనాన్ని తలపించేలా నిర్మితమవుతోంది.ప్రస్తుతం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం బేగంపేటలో ఉంది. అది అనువుగా లేదని భావించిన ప్రభుత్వం పంజాగుట్ట లో దాదాపు 9 ఎకరాలలో నూతన క్యాంపు కార్యాలయాన్ని నిర్మిస్తోంది.ఎకరం విస్తీరణంలో మూడు భవనాలు,మిగిలిన 8 ఎకరాలు 300 కార్ల పార్కింగ్ కు, పచ్చదనానికి కేటాయించనున్నారు. కాగా మొదట దీనిఖర్చు రూ 33 కోట్లుగా భావించినా, కానీ ఇది రూ 50 కోట్ల వరకు చేరింది.
దాదాపు కిలోమీటరు మేర ప్రహరీ గోడ నిర్మించనున్నారు.ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్టుని షాపూర్ జీ – పల్లోంజీ సంస్థ దక్కించుకుంది.దీనిని దసరాకే పూర్తి చేయాలనుకున్నప్పటికీ అది జరగలేదు.దాదాపు పనులు పూర్తైపోయాయని ఇంకా కొద్దీ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు అంటున్నారు.
Leave a Reply