ఎన్నికలు రద్దు చేసి నన్ను విజేతగా ప్రకటించాలి హిల్లరీ వస్తే మనం చూసేది మూడో ప్రపంచ యుద్ధమే.. అంటున్న డోనాల్డ్ ట్రంప్ | Telugu News
500, 1000రూ లకు గుడ్ బై చెప్పిన మోడీ ప్రభుత్వం !!!-భారత్‌లో కోటీశ్వరులెందరో తెలుసా?-ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు 'ఉడాన్'పథకం:గంట విమాన జర్నీకి రూ.2,500-ఆన్‌లైన్‌లో హల్‌చల్ భారత రిజర్వు బ్యాంకు త్వరలో తెలుపు,పింక్ రంగు కలయికగా రూ.2 వేల నోట్లు..-ఫెస్టివల్ బొనాంజ కింద మహిళలకు ఓ శుభవార్త.. తక్కువ వడ్డీతో గృహ రుణాలు..-హైదరబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు కళల బండి వచ్చేస్తోంది…!!-టాలీవుడ్ స్టార్ మహేష్ బ్రాండ్ ప్రమోషన్స్ .. క్రెడిట్ ఆమెకే-"న్యూడ్ గా నటించాలంటే మాత్రం నో చెప్పేస్తా" అని అంటోంది.-ఎస్ఎస్ థమన్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ 'పవన్ కళ్యాణ్' సినిమాలో ఛాన్స్ కొట్టేసినాడు-ఒక్కరోజు ముందే బరిలోకి దూకనున్న బాలయ్య..

ఎన్నికలు రద్దు చేసి నన్ను విజేతగా ప్రకటించాలి హిల్లరీ వస్తే మనం చూసేది మూడో ప్రపంచ యుద్ధమే.. అంటున్న డోనాల్డ్ ట్రంప్

టోలెడో:
రాజకీయమంటే ఎక్కడ ఉన్నా ఒకటే.. ఒకరిపై ఒకరు విమర్శల జల్లు కురిపిస్తూనే ఉంటారు. మన దేశంలో జరిగే ఎన్నికల సమయంలో చేసే వాగ్దానాలు విమర్శలు మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. మరి అమెరికా లోని టోలెడో లో జరగబోతున్న ఎన్నికల ప్రచారం లో ఏవేం వాగ్దానాలు విమర్శలు వినిపిస్తున్నాయ్యో కనిపిస్తున్నాయో ఒక కన్నేద్దాం.. రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరియు డెమొక్రటిక్ అభ్యర్థి మధ్య జరగబోతున్న ఎన్నికలలో ఘాటైన విమర్శలే వినిపిస్తున్నాయి.

అమెరికా అధ్యక్ష పదవి కోసం జరుగనున్న ఎన్నికలను ఇప్పుడు రద్దు చేసి ప్రజలంతా కలిసి తనను ఏకగ్రీవంగా విజేతగా ప్రకటించాలంటూ రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఓహియాలోని టోలెడోలో తన సపోర్టర్స్ ను ఉద్దేశించి ఆయన ఇటీవలే ప్రసంగించారు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కుదిరిన నార్త్ అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల ఓహియో రాష్ట్రంలో అనేక వేల సంఖ్యలో ఉద్యోగాలు పొరుగు సేవల కింద మెక్సికోకు తరలాయని డోనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఇప్పుడు ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఒప్పందం కుదరాలని డెమెక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆశిస్తున్నట్టు ఆయన అన్నారు. ‘‘హిల్లరీ వాణిజ్య విధానాలు చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఇప్పుడు ఈ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయి?? వీటిని పూర్తిగా రద్దు చేసి నేరుగా నన్ను విజేతగా ప్రకటించాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. సిరియా, రష్యా విషయంలో హిల్లరీ తీరు చాలా ప్రమాదకరంగా ఉందని ఆమె అధికారంలోకి వచ్చిందంటే మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయని ఆయన ఘాటుగా విమర్శించారు. తనని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే రష్యాతో కలిసి ఇస్లామిక్ స్టేట్ అంతు కచ్చితంగా చూస్తానని ట్రంప్ అన్నారు. ఇటీవల వచ్చిన ఒపీనియన్ పోల్స్ కూడా తప్పుడు లెక్కలే అనీ అసలు పోల్స్ ని వక్రీకరించి హిల్లరీకి అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి అని ఆయన ఆరోపించారు. ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అయన ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన హిల్లరీ ప్రజా ధనాన్ని తన ఇష్టాలకు ఇంధనంగా మార్చుకుని పెద్ద ఎత్తున వృథా చేశారని ట్రంప్ మండిపడ్డారు. వివిధ కారణాలతో ఆమె గతంలో చేసిన ఖర్చులకు సంబంధించిన అన్ని వివరాలను ఆయన జనం ముందు బయటపెట్టారు. ‘‘హిల్లరీ తన జీవితంలో నిజాయితీగా ఒక్క డాలర్ కూడా సొంతగా సంపాదించలేదు, కానీ ప్రజల డబ్బుతో ఆమె విలాస వంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు’’ అని ట్రంప్ హిల్లరీ పై మండి పడ్డారు. ఇదిలా ఉంటే మరోవైపు హిల్లరీతో కలిసి ఆవిడకు మద్దతు ని ఇస్తూ అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా ఉత్తర కరోలినా లోని ఓ పొలిటికల్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మిషెల్ మాట్లాడుతూ అధ్యక్ష పదవిని నిర్వహించగలిగే పరిణతి, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి హిల్లరీ అని తాను విశ్వసిస్తున్నట్టు ఆవిడా తన నమ్మకాన్ని బయట పెట్టారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *