నిరంతరం రగిలే నిప్పుకణిక.. ప్రపంచచరిత్రలో మీ పేజి ఎప్పటికి సజీవం | Telugu News
ఈ కథ చదవడం మాత్రం మిస్ అవ్వొద్దు-ఉభయ సభల్లో గందరగోళం మధ్య ఆమోదం పొందిన ఐటీ చట్టసవరణ బిల్లు-మసకబారుతున్న మానవత్వానికి వెలుగు చూపుతున్న మంచి మనసులు-జమ్మూలో ఆర్మీ ఆయుధ కేంద్రంపై ఉగ్రవాదుల అట్టాక్-2000 నోటుని సైతం రద్దు చ్చేయనున్న మోడీ సర్కారు!!-పొట్ట కూటి కోసం నిగ్రహంతో సజీవ విగ్రహంలా 30 ఏళ్ళు నిలబడ్డాడు-జియో యూజర్లు ఈ మాట విన్నారంటే పండుగ చేసుకుంటారు-ఆధునిక తెలుగుకు అడుగుజాడ మన గురజాడ-సూపర్ స్టార్ రోబో2లో నలుగురు స్టార్ హీరోలు ఉన్నారా??-ఒక ప్రభుత్వ డాక్టర్ పేద విద్యార్థి ప్రాణంతో ఆడుకున్న ఆట

నిరంతరం రగిలే నిప్పుకణిక.. ప్రపంచచరిత్రలో మీ పేజి ఎప్పటికి సజీవం

అసలు ఆ దేశం జనాభా ఎంత..??
ప్రపంచపటంలో ఆ దేశం ఎంత..??

పైగా పక్కనే ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా..!!

అన్నింటిలో మేటి సాటి అని చెప్పుకునే అమెరికాను ఎదిరించాలన్నా..పోటి పడలన్నా లేదా పోరాడాలన్నా రష్యా చైనాలాంటి అతి పెద్ద శక్తి సామర్థ్యం ఉన్న దేశాలే ఆలోచిస్తూ.. ఎలా దెబ్బ కొట్టాలి అని నిరంతరం తమ ఆదిపత్యాన్ని చూపాలని ఆలోచిస్తూ ఉంటాయి..!!

అలాంటి అమెరికాని సైతం..పక్కనే ఉన్న అతిచిన్నదేశం .. సరిగ్గా చెప్పాలంటే నీటిబిందువు అంత పరిమాణంలో ఉన్న ఆ చిన్నదేశం నుండి నేను ఉన్నాను అని ఒక నిప్పుకణం ఉద్బవించింది..!!
ఆ దేశం పేరు క్యూబా..ఆ నిప్పుకణం పేరు..ఫిడేల్ క్యాస్ట్రో..!!

ఏంటి ఆ తెగువ..ఆ పోరాటం..??
మానవమాత్రులకి సాధ్యం అయ్యేపనేనా ఆయన పోరాటం..??


ఆ హత్యప్రయత్నాలు ఏంటి..?? ఏకంగా 638 సార్లా..??

అసలు ప్రపంచంలో ఏ మనిషిపైనా ఇన్నిసార్లు హత్యాయత్నం జరగలేదేమో..!!
నిజంగా దేవుడే కాపాడాడా లేక ప్రజల దీవెనలు లేక ఆయన న్యాయమైన పోరాటం ఆయన్ను కాపడిందా అంటే సమాధానం చెప్పడం కష్టం..!!

లేకుంటే సొంత భార్యకూడా విషప్రయోగం చేస్తే బయటపడటం ఏంటి..??
ఇక ఆయన 6 గంటల ఏకధాటి ప్రసంగం ప్రపంచంలో ఇప్పటికి ఒక రికార్డు..!!
ఆయన ఐక్యరాజ్యసమితిలో చేసిన 4 గంటల సుదీర్ఘ ప్రసంగం కూడా ఒక రికార్డు..!!
ఇక ఆయన తన దేశంకోసం పోరాటం చేసిన అధ్యాయాలు.. ఆయన విలక్షణ శైలి..న్యాయంకోసం తనవారి కోసం ఏదైనా చెయ్యగలిగే ధీరత్వం..ప్రపంచంలో మేటిగా..గొప్పగా.. కోట్లాదిమంది ప్రజల మనసులు గెలిచేలా చేసింది అనడం చాలా చిన్న పదం..!!

అలాంటి వారు యుగపురుషులే అనడం కూడా చిన్నపదమే..!!
ఎందుకంటే వారు చేసిన త్యాగాలు అసమానమైన అంకితభావం అమెరికాసైతం చిన్నబోయేలా చేసి నేడు ప్రపంచంముందు తలవంచింది..!!
.
అమెరికాను ఎదిరించిన వారు ఎవరైనా మనకు ఇష్టులే..!!
ఎందుకంటే పెద్దన్న హోదా దక్కించుకొని..ప్రపంచం అంతా నా చెప్పుచేతల్లో.. నేను చెప్పినట్టు వినాలి అనే అహంకారానికి ఇలాంటివారు తారసపడి వారికి బుద్దిచెప్పేవారు అంటే మనకు మరింత ఇష్టం..వారు ఆరాధ్యులు కూడా..!!

క్యాస్ట్రో గారు..మీరు ఎప్పటికీ రగిలే నిప్పుకణమే..!!
ప్రపంచ చరిత్రలో మీ పేజి ఎప్పటికి చెరిగిపోదు..అది సజీవమే..మరియు స్ఫూర్తిదాయకమే..!!

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts