జయలలిత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు…
* జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది అమ్మమ్మ పేరు. బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం పాఠశాలలో చేర్పించినప్పుడు జయలలిత అని పేరు పెట్టారు.
* జయలలిత తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.
* తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో ఆమె నటించారు. ఇజ్జత్ అనే ఒక్క హింది సినిమాలో నటించారు.
* జయ తెలుగులో 28 సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం మనుషులు మమతలు.
* జయలలిత 15వ ఏటే సినిమాల్లోకి అడుగుపెట్టారు. మెట్రిక్యులేషన్ స్టేట్ టాపర్ అయిన ఆమె తొలి సినిమాలోనే విడో పాత్రను పోషించారు.
* జయలలిత 1981లో రాజకీయాల్లోకి వచ్చారు. 1983 నుంచి 1989 వరకు రాజ్యసభ సభ్యురాలుగా పనిచేశారు.
* 1972లోనే తమిళనాడు ప్రభుత్వం జయలలితను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.
* అత్యంత పిన్న వయసులోనే తమిళనాడు సీఎంగా ఎన్నికైన వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పారు. 43 ఏళ్లకే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు.
* అక్రమాస్తుల కేసు కారణంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన తొలి వ్యక్తి జయలలిత.
* ఎంజీఆర్ చనిపోయాక ఆయన వారసురాల్ని తానేనని జయ ప్రకటించుకున్నారు.
* జయలలితకు శశికళతో చాలా సాన్నిహిత్యం ఉంది. ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. దీంతో శశికళ జయకు స్లో పాయిజన్ ఇచ్చిందని, అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని తెహల్కా కథనం.
* జయలలితకు జయకుమార్ అనే సోదరుడు ఉండేవాడు.. 1995లో ఆయన చనిపోయాడు. జయకు అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆయన కూతురు ప్రియ జయను చూసేందుకు అపోలోకు వచ్చింది. కానీ ఆమెను లోపలికి అనుమతించలేదు.
* జయలలిత తన బంధువుల్ని ఎవర్నీ తన నివాసమైన పోయస్ గార్డెన్లోకి రానివ్వలేదు. తన మేన కోడలు చాలాసార్లు వచ్చి ఆమెను కలిసేందుకు ప్రయత్నించినా.. జయ అందుకు అంగీకరించలేదు.
* ఆమె శోభన్ బాబుతో ప్రేమాయణం నడిపిందనే వార్తలున్నాయి.
* జయలలిత భారీ ఖర్చుతో తన దత్త పుత్రుడి పెళ్లి చేశారు. ఆ పెళ్లికి రూ.100 కోట్లు ఖర్చయ్యాని వార్తలొచ్చాయి.
* జయ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు వ్యక్తి మర్రి చెన్నారెడ్డి తమిళనాడు గవర్నర్‌గా వ్యవహరించారు. ఆయనతో జయకు సరిగా పడేది కాదు. చెన్నారెడ్డి కూడా జయతో పోరాడేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గేవాడు కాదు. ప్రస్తుత తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్ విద్యాసాగరరావు, ఆయన కంటే ముందు గవర్నర్‌గా పని చేసిన రోశయ్య.. ఈ ముగ్గురూ జయ హయాంలో తమిళనాడు గవర్నర్లుగా పని చేశారు.
* తమిళ ప్రజలు, జయలలితను అమ్మ, పురట్చి తలైవి అని పిలుస్తుంటారు. పురట్చి తలైవి అంటే విప్లవ నాయకురాలు అని అర్థం.
Related Posts
- తమిళనాడు ఉక్కు మనిషి ఇక లేదు
- అమ్మకి అశ్రునయనాలతో నివాళులు
- అమ్మ అస్తమయంతో శోక సంద్రంలో తమిళనాడు
- పక్క దేశాలు సైతం మోడీని ప్రశంశలతో ముంచెత్తుతున్నారు
- చంద్రబాబు కన్వీనర్‌గా 13 మందితో నీతి ఆయోగ్ కమిటీ
- 2000 నోటుని సైతం రద్దు చ్చేయనున్న మోడీ సర్కారు!!
- నల్లకుబేరుల మెడకు పూర్తిగా ఉచ్చు బిగించిన కేంద్ర ప్రభుత్వం
- మళ్ళీ పీఎం మోడీయేనా??
- నోట్ల రద్దుపై విపక్షాలు చేపట్టబోతున్న బంద్ ఫలిస్తుందా???
- అమ్మ ఆస్తులు ఎవరికి????
- తిరుగులేని ముఖ్యమంత్రులుగా రాజకీయ పీఠాన్ని అధిష్టించిన ముగ్గురు సినీ నటులు
- అలుపెరగని ఆటంబాబు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్థానం
- పొట్ట కూటి కోసం నిగ్రహంతో సజీవ విగ్రహంలా 30 ఏళ్ళు నిలబడ్డాడు
- ఇక్కడ దైవం అన్నగారు అక్కడ దేవత అమ్మ
- జయ కోసం తపించిన శోభన్…!!
- అమ్మకు నివాళి అర్పించిన టాలీవుడ్ ప్రముఖులు..
Related Posts
- తమిళనాడు ఉక్కు మనిషి ఇక లేదు
- అమ్మకి అశ్రునయనాలతో నివాళులు
- అమ్మ అస్తమయంతో శోక సంద్రంలో తమిళనాడు
- పక్క దేశాలు సైతం మోడీని ప్రశంశలతో ముంచెత్తుతున్నారు
- చంద్రబాబు కన్వీనర్‌గా 13 మందితో నీతి ఆయోగ్ కమిటీ
- 2000 నోటుని సైతం రద్దు చ్చేయనున్న మోడీ సర్కారు!!
- నల్లకుబేరుల మెడకు పూర్తిగా ఉచ్చు బిగించిన కేంద్ర ప్రభుత్వం
- మళ్ళీ పీఎం మోడీయేనా??
- నోట్ల రద్దుపై విపక్షాలు చేపట్టబోతున్న బంద్ ఫలిస్తుందా???
- అమ్మ ఆస్తులు ఎవరికి????
- తిరుగులేని ముఖ్యమంత్రులుగా రాజకీయ పీఠాన్ని అధిష్టించిన ముగ్గురు సినీ నటులు
- అలుపెరగని ఆటంబాబు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్థానం
- పొట్ట కూటి కోసం నిగ్రహంతో సజీవ విగ్రహంలా 30 ఏళ్ళు నిలబడ్డాడు
- ఇక్కడ దైవం అన్నగారు అక్కడ దేవత అమ్మ
- జయ కోసం తపించిన శోభన్…!!
- అమ్మకు నివాళి అర్పించిన టాలీవుడ్ ప్రముఖులు..
Leave a Reply