అలుపెరగని ఆటంబాబు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్థానం | Telugu News
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక ఇవ్వనున్న చంద్రబాబు..!!-కరుణను తట్టుకోవాలంటే మోదీ సాయం తప్పదు...-చలికాలంలో ఇవి తింటే మంచిది...-ముంబాయి టెస్టులో ఇరు జట్లకు తొలిసారిగా....-అన్నగారి పేరిట అవార్డు ఇవ్వనున్న తెలంగాణ రాష్ట్రం...-కేజీ నుంచి పీజీ వరకూ ఒకేచోట ఉండేలా తెలంగాణకు రానున్న విద్యాసంస్థ...-తెలంగాణ సీఎం కెసిఆర్ మీద ఫైర్ అయినా టీడీపీ ఫైర్ బ్రాండ్...-ఈ బీచ్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటా....-అమ్మ రాక కోసం రాత్రి వరకు చూసిన గుడి....-అల్లరోడు ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్ లైట్ తీసుకోమంది అంటా...

అలుపెరగని ఆటంబాబు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్థానం

తమిళనాడు ప్రజలంతా ప్రేమతో అమ్మ అని పిలుచుకునే తమిళనాడు ముఖ్యమంత్రి పూర్తి పేరు జయలలిత జయరాం. జయరాం, వేదవల్లి దంపతులకు ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరురాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జన్మించింది.
తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది కావడంతో బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు.

జయలలిత అసలు పేరు కోమలవల్లి.
స్వర్గస్తురాలైన ఆవిడ అవ్వగారి పేరుతో ఆమెకు కోమలవల్లి అని నామకరణం చేశారు.
పాఠశాలలో చేర్చేటపుడు జయలలిత అనే రెండో పేరును నమోదు చేశారు.

రాజకీయ ప్రయాణం

తిరుచ్చి జిల్లా శ్రీరంగం పూర్వీకంగా కలిగిన జయలలిత 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించింది. రామచంద్రన్ మరణానంతరం అతని భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిననూ ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయింది.

1989 అసెంబ్లీ ఎన్నికలలో జయలలిత విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం సంపాదించిరి.
1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది.

ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది.
5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి 2006 మేలో జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందినది.

ఆమె పార్టికి కేవలము నాలుగు స్థానాలే దక్కాయి. అయినా ఆవిడ కృంగిపోలేదు.

2006 లో ఓటమి సమయంలో తమ మిత్రపక్షాలతో కలిసి శాసన సభలో అత్యంత పటిష్ఠమైన ప్రతిపక్షంగా నిలవగల సీట్లను సంపాదించారు.

ఈమే ప్రస్తుత తమిళ నాడు ముఖ్యమంత్రి.
అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి (విప్లవాత్మక నాయకురాలు)
అని పిలుస్తుంటారు.

సినీ సంస్థానం:
కుటుంబ పరిస్థితుల వలన ఈమె తల్లి బలవంతముతో అయిష్టంగానే సినిమా రంగంలోకి అడుగు వేసింది. తన 15వ యేట సినిమా రంగములో ప్రవేశించింది.
కథానాయకుని కథ(1965)

మనుషులు మమతలు(1965)

ఆమె ఎవరు? (1966)

ఆస్తిపరులు (1966)

కన్నెపిల్ల (1966)

గూఢచారి 116(1966)

నవరాత్రి (1966)

గోపాలుడు భూపాలుడు (1967)

చిక్కడు దొరకడు(1967)

ధనమే ప్రపంచలీల(1967)

నువ్వే (1967)

బ్రహ్మచారి (1967)

సుఖదుఃఖాలు(1967)

అదృష్టవంతులు(1968)

కోయంబత్తూరు ఖైదీ(1968)

తిక్క శంకరయ్య(1968)

దోపిడీ దొంగలు(1968)

నిలువు దోపిడి(1968)

పూలపిల్ల (1968)

పెళ్ళంటే భయం(1968)

పోస్టుమన్ రాజు(1968)

బాగ్దాద్ గజదొంగ(1968)

శ్రీరామకథ (1968)

ఆదర్శ కుటుంబం(1969)

కథానాయకుడు(1969)

కదలడు వదలడు(1969)

కొండవీటి సింహం(1969)

పంచ కళ్యాణి దొంగల రాణి (1969)

ఆలీబాబా 40 దొంగలు (1970)

కోటీశ్వరుడు (1970)

గండికోట రహస్యం(1970)

మేమే మొనగాళ్లం(1971)

శ్రీకృష్ణ విజయం(1971)

శ్రీకృష్ణసత్య (1971)

భార్యాబిడ్డలు(1972)

డాక్టర్ బాబు (1973)

దేవుడమ్మ (1973)

దేవుడు చేసిన మనుషులు (1973)

లోకం చుట్టిన వీరుడు(1973)

ప్రేమలు – పెళ్ళిళ్ళు(1974)

తెలుగు కన్నడలో తీసిన తొలి సినిమాలు మంచి హిట్ సాధించడంతో జయలలిత ఒక బ్రాండ్ లా తయారయ్యింది.
జయలలిత తొలి సినిమా ” చిన్నడ గొంబె కన్నడ ” చిత్రము పెద్ద హిట్టయ్యింది.

ఈమె తొలి తెలుగు సినిమా “మనుషులు మమతలు ” ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది.

1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించింది.

ఈమె అవివాహిత గానే జీవితాన్ని గడిపారు.

జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా, ఎదురు నిలిచి పోరాడింది.

ఆమె మీద పెట్టిన 11 కేసులలో తొమ్మిది కేసులు పూర్తి అయ్యాయి. మిగిలిన రెండు కేసులలో ఆమె పోరాడుతుంది.

* 1988 లో రాజ్యసభకు నామినేట్ చేయబడింది.

* 1989 గెలుపు,

* 1991 గెలుపు.

* 1996 లో జయలలితపై వచ్చిన కొన్ని అభియోగాలు కారణంగా ఓడిపోయిన ఆమె పార్టీ (1996 ఓటమి),

* (2001 గెలుపు)

* 2001 లో అత్యధిక మెజారిటీతో గెలిచింది.

* 2006 లో ఓటమి.

* 2011 లో తిరుగులేని ఎన్నిక.

* 2016 లో కూడా విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణము చేశారు.

తమిళ నాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన “ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం ” యొక్క సాధారణ కార్యదర్శి.

ఆమెలోని తెగింపు ధైర్యం తేజం చూసి ఆమె అభిమానులు ఆమెను పురట్చి తలైవి (విప్లవ నాయకురాలు) అని పిలుచుకుంటారు.

ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది.

ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది.

1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది.
ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది.
జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి.

సెప్టెంబరు 27, 2014 న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దైనది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి అయింది.

మే 11, 2015న కర్ణాటక ఉన్నత న్యాయస్థానము ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
అలుపెరగని ముఖ్యమంత్రిగా తమిళనాడు జనాలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ అందరి నోటా అమ్మా అని పిలిపించుకుంటున్న జయలలిత అకస్మాత్తుగా అందరికీ విషాదాన్ని నింపింది.
గత కొన్ని రోజులుగా అస్వస్థతకి లోనయ్యిన జయలలిత అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ఈ రోజు సాయంత్రం 5:30ని లకు ఆవిడ చనిపోయినట్టు తమిళ న్యూస్ చానెల్స్ లో కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇంతకీ ఆవిడ మరణ వార్త నిజమో కాదో తెలియలేదు కానీ తమిళనాడు ప్రజలు మాత్రం అమ్మకి ఏం కాకూడదని పూజలు చేస్తూ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts