రేపు రాత్రికి మాత్రం చంద్రుడిని మిస్ అవ్వొద్దు…
రేపు రాత్రి పున్నమి చంద్రుని చూడటం మిస్ అయితే ఆ అద్భుత దృశ్యాన్ని చూడాలంటే 18 ఏళ్ళు వేచి చూడాలసిందే.
ఇంతకీ ఏంటా అద్భుత దృశ్యం??
అందాలు చిందించి వెండి వెన్నెలను చూడటానికి 18 ఏళ్ళు ఎదురు చూడాలంటారా…
అవును ఖచ్చితంగా ఎదురు చూడాలసిందే!
ప్రతి నెల పౌర్ణమి వస్తే చాలు ఎక్కడలేని అంద చందాలతో జాబిల్లి తన అందాల విందుతో వినీల ఆకాశంలో విరబూస్తుంది. రేపు ప్రత్యేకత ఏంటో అందరికి తెలుసు కదా కార్తీక పౌర్ణమి. అందాల చందమామ తన మతైన అందాలను మరింత అందంగా మలుచుకుని మన ముందు ఉంచుతుంది. కార్తీక పౌర్ణమి అంటే అటు భక్తులకి ఇటు భగవంతునికే కాకుండా జాబిల్లి ప్రేమికులు కూడా ముఖ్యమైన రోజే కానీ మనం రేపు చూడబోయే జాబిల్లి మాత్రం ప్రతి ఏటా వచ్చే కార్తీక పౌర్ణమి కంటే మరింత శక్తివంతమైనది,మరిచిపోలేనిది. రేపు రాత్రికి ఎప్పటికంటే మరింత అందంగా, ప్రకాశవంతంగా వెలుగులు విరజిమ్ముతూ మనకి మరింత దగ్గరగా చేరువై తన వయ్యారాలా వలకబోతతో ఊరించబోతుంది మన జాబిలమ్మ. ఇది ప్రకృతి ప్రేమికులో పండితులో చెబుతున్న మాట కాదు మన ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న నగ్న సత్యం .
నవంబర్ 14న వినీలాకాశంలో ఈ 21వ శతాబ్దంలో ఎప్పుడూ జరగని ఓ అద్భుత ఘట్టం జరగనుందట. రేపు చందమామ ఎప్పుడూ కనిపించనంత పెద్ద సైజు లో కనిపించబోతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. దాదాపు 13 శాతం పెద్దద్దిగా 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపించబోతోందట.సూర్యుడు,చంద్రుడు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉండడం వల్ల జాబిల్లి మన భూమికి అత్యంత దగ్గరకి రానున్నదంట. ఇలాంటి అద్భుతమైన ఘట్టాన్ని ఇప్పుడు చూడకపోతే మళ్ళీ 2034 సంవత్సరం నవంబర్ 14 వరకు ఎదురు చూడాలసిందే అంట!
ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఎందుకు మిస్ అవ్వుతాము. తెలిసి తెలిసి ఎవరూ మిస్ అవ్వలేరు కదా… 18 సంవత్సరాలు ఎదురు చూడటమంటే కష్టమే కదా మరి.. అప్పటి వరకు ఎవరు ఉంటారో ఎవరు ఉండరో మన చేతుల్లో లేదు కాబట్టి ఇంట్లో ఉన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు అందరికీ ఈ అరుదైన కార్తీక పౌర్ణమి చంద్రుడి సోయగాలని చూపించే ప్రయత్నం చేద్దాం.
Related Posts
- హరిహరాత్మకం… వైకుంఠ చతుర్దశి!!!
- చిత్రమైన రంగుల జలపాతం…..!!
- ఇండియాలో మినీ స్విట్జర్లాండ్…
- కార్తీక పున్నమి శోభను అలంకరించుకుని జాతరకు సిద్దమైన శ్రీ బుగ్గరామలింగేశ్వర పుణ్యక్షేత్రం!!!
- కార్తీక వనభోజనాల వైభోగమే వేరు
- జియో యూజర్లు ఈ మాట విన్నారంటే పండుగ చేసుకుంటారు
- కొబ్బరిచెట్ల నడుమ కొలువైన నరసింహ క్షేత్రం, అంతర్వేది
- 500, 1000రూ లకు గుడ్ బై చెప్పిన మోడీ ప్రభుత్వం !!!
- వైఫై ఫస్ట్….వైఫ్ నెక్స్ట్…
- సర్జికల్ స్ట్రైక్స్ ఇలా జరిగింది…
- పొట్ట కూటి కోసం నిగ్రహంతో సజీవ విగ్రహంలా 30 ఏళ్ళు నిలబడ్డాడు
- చెంచులకోనే పెంచల కోన..
- పశ్చిమగోదావరి జిల్లాలో పట్టసాచల క్షేత్రం..
- రియో ఒలింపిక్స్ హాకీ పురుషులలో భారత్ పై నెదర్లాండ్ గెలిసింది
- పాత నోట్లను ఇలా మార్చుకోవచ్చు….
- కోహ్లీని దెబ్బతీయాలని అనుకున్న కుక్…..
Related Posts
- హరిహరాత్మకం… వైకుంఠ చతుర్దశి!!!
- చిత్రమైన రంగుల జలపాతం…..!!
- ఇండియాలో మినీ స్విట్జర్లాండ్…
- కార్తీక పున్నమి శోభను అలంకరించుకుని జాతరకు సిద్దమైన శ్రీ బుగ్గరామలింగేశ్వర పుణ్యక్షేత్రం!!!
- కార్తీక వనభోజనాల వైభోగమే వేరు
- జియో యూజర్లు ఈ మాట విన్నారంటే పండుగ చేసుకుంటారు
- కొబ్బరిచెట్ల నడుమ కొలువైన నరసింహ క్షేత్రం, అంతర్వేది
- 500, 1000రూ లకు గుడ్ బై చెప్పిన మోడీ ప్రభుత్వం !!!
- వైఫై ఫస్ట్….వైఫ్ నెక్స్ట్…
- సర్జికల్ స్ట్రైక్స్ ఇలా జరిగింది…
- పొట్ట కూటి కోసం నిగ్రహంతో సజీవ విగ్రహంలా 30 ఏళ్ళు నిలబడ్డాడు
- చెంచులకోనే పెంచల కోన..
- పశ్చిమగోదావరి జిల్లాలో పట్టసాచల క్షేత్రం..
- రియో ఒలింపిక్స్ హాకీ పురుషులలో భారత్ పై నెదర్లాండ్ గెలిసింది
- పాత నోట్లను ఇలా మార్చుకోవచ్చు….
- కోహ్లీని దెబ్బతీయాలని అనుకున్న కుక్…..
Leave a Reply