అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్…
అమెరికా అధ్యక్షుడు ఎవరో తెలిసిపోయింది ముందు నుండి ఆవేశపూరిత ప్రసంగాలతో దూసుకెళ్తూ అలాగే వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన ట్రంప్ నే అమెరికా 45 వ అధ్యక్షునిగా చేశారు. సౌమ్యురాలిగా,ఆలోచనాపరురాలిగా పేరు ఉన్న హిల్లరీకి అమెరికా ప్రజలు మొండి చెయ్యి చూపించారు.
తాజాగా వెలువడిన ఫలితాలు ప్రకారం ఎలక్ట్రోరల్ ఓట్లకు గానూ ట్రంప్‌కు 276 ఓట్లు, హిల్లరీకి 218 ఓట్లు నమోదయ్యాయి. అమెరికా అధ్యక్ష స్థానాన్ని పొందాలంటే కనీసం 270 ఓట్లు పొందాలి. ఈ అసలైన మ్యాజిక్ ఫిగర్‌ను ట్రంప్ దాటేశారు, ఇంకా ఫలితాలు వెలువడుతూనే ఉన్నాయ్ మొత్తం పూర్తి అయ్యేసరికి ఇంకా ఆధిక్యంలో దూసుకెళ్తున్న ట్రంప్. కాకపోతే మొదటి నుండి ఆధిక్యం కనపరిచిన హిల్లరీ తనకే అమెరికా ప్రజలు అనుకూలంగా ఉన్నారు అనుకున్నారు కాని చివరికి వచ్చేసరికి ఫలితాలు తారుమారు అయిపోయాయి అనూహ్యంగా ట్రంప్ విజయం దిశగా దూసుకొచ్చేసారు.
కానీ ఆశ్చర్యం ఏంటి అంటే డోనాల్డ్ ట్రంప్ కి హిల్లరీ కి ఒక్క శాతం మాత్రమే తేడా ఉంది. 1% తేడాతో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ట్రంప్ ఎన్నికలలో మహిళల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు పలు విమర్శలు కూడా వచ్చాయి, అలాగే కన్నా కూతురి పై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ ట్రంప్ పై చాలా వ్యతిరేకిత వ్యక్తమైన అది అమెరికా ప్రజలకి పట్టలేదు అధ్యక్ష ఎన్నికలలో ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి చివరికి ట్రంప్ నే అమెరికా అధ్యకుడుగా చేశారు.హిల్లరీ విజయం ఖాయమనుకుని ధీమాతో ఉన్న డెమొక్రాట్లు ఫలితాల సరళితో నివ్వెరపోతున్నారు!
వైట్‌హౌస్ గురించి ప్రపంచానికి పరిచయం చేయనక్కరలేదు. అక్కడ అధ్యక్షుడిగా కూర్చున్న వ్యక్తి ప్రపంచాన్ని తన కనుసైగలతో శాసించిన రోజులెన్నో. అమెరికా అధ్యక్షుడంటే ప్రపంచానికి అప్రకటిత రాజు… ఇంతటి కీలకమైన పదవిని ఎవరు అధిరోహించబోతున్నారనేది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠరేకెత్తిస్తోంది. తాజా సమాచారం ప్రకారం రిపబ్లికన్ పార్టీ నామినీ ‘డొనాల్డ్ ట్రంప్’ దుమ్మురేపుతున్నారు. అంచనాలను, సర్వేలను చెత్తకుప్పలోకి నెట్టేస్తున్నారు ట్రంప్.. హిల్లరీ వర్గానికి చెమటలు పట్టిస్తున్నారు. ఎవరూ ఊహించనంతగా 276 ఎలక్ట్రోరల్ ఓట్లతో ముందంజలో ఉన్నారు. హిల్లరీ 215 ఎలక్ట్రోరల్ ఓట్లతో ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నారు. సర్వేలు, విశ్లేషకులు పేర్కొన్నట్లుగానే ట్రంప్, హిల్లరీకి పోలైన ఓట్లశాతంలో వ్యత్యాసం 1 శాతం మాత్రమే. అధ్యక్షపదవి రేసులో దూసుకుపోతున్న ట్రంప్ 48 శాతం ఓట్లతో ముందంజలో నిలవగా హిల్లరీ 47 శాతం ఓట్లతో వెనుకంజలో కొనసాగుతున్నారు. లిబర్టీరియన్ పార్టీ నామినీ 3 శాతం, గ్రీన్ పార్టీ నామినీ 0.9 శాతం ఓట్లతో కొనసాగుతున్నారు.
మొత్తనికి ట్రంప్ విజయం భారతదేశం పైన పడింది ఈరోజు స్టాక్ మార్కెట్స్ కూడా కుప్పకూలాయి. చూద్దాం ట్రంప్ ప్రభావం మనదేశంపై ఎంతవరకు పడుతుందో. మరి రానున్న రోజులలో ట్రంప్ ఇండియాకి ఏ విధంగా సాయపడతారో చూద్దాం.
Leave a Reply