ఇన్నాళ్లు ఈ సమయం కోసమే ఎదురుచూస్తున్నానన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ !
‘సరైనోడు’ సూపర్ సక్సెస్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మధ్యే ‘దువ్వాడ జగన్నాథం’ పేరుతో ఓ కొత్త సినిమాకి సైన్ చేశాడు. ఇప్పటికే హైదారాబాద్ లో ఈ చిత్రం యొక్క షూటింగ్ జరుగుతోంది. హరీష్ శంకర్ ఇన్నాళ్లు హీరో హీరోయిన్ల మినహా మిగతా నటీ నటుల పై సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షూటింగ్లో ఈ రోజు నుండి అల్లు అర్జున్ జాయినయ్యాడు. ఇక సినిమా షూటింగ్ ఫిబ్రవరి వరకూ నిరాటంకంగా కొనసాగనుంది.
ఈ విషయాన్నే అల్లు అర్జున్ తెలుపుతూ ‘లాంగ్ గ్యాప్ తరువాత మొదటిరోజు షూటింగ్ కు వెళుతున్నాను. చాలా రోజులుగా దీనికోసమే ఎదురుచూస్తున్నాను. మళ్ళీ షూట్ కి వచ్చినందుకు హ్యాపీగా ఉంది’ అంటూ ఆనందాన్ని వ్యక్తపరచగా దర్శకుడు హరీష్ శంకర్ కూడా ‘ఆర్య సినిమా చూసినప్పటి నుండి అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది’ అంటూ ట్వీట్ చేశాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నా ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది.
Leave a Reply