తిరుగులేని ముఖ్యమంత్రులుగా రాజకీయ పీఠాన్ని అధిష్టించిన ముగ్గురు సినీ నటులు | Telugu News
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక ఇవ్వనున్న చంద్రబాబు..!!-కరుణను తట్టుకోవాలంటే మోదీ సాయం తప్పదు...-చలికాలంలో ఇవి తింటే మంచిది...-ముంబాయి టెస్టులో ఇరు జట్లకు తొలిసారిగా....-అన్నగారి పేరిట అవార్డు ఇవ్వనున్న తెలంగాణ రాష్ట్రం...-కేజీ నుంచి పీజీ వరకూ ఒకేచోట ఉండేలా తెలంగాణకు రానున్న విద్యాసంస్థ...-తెలంగాణ సీఎం కెసిఆర్ మీద ఫైర్ అయినా టీడీపీ ఫైర్ బ్రాండ్...-ఈ బీచ్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటా....-అమ్మ రాక కోసం రాత్రి వరకు చూసిన గుడి....-అల్లరోడు ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్ లైట్ తీసుకోమంది అంటా...

తిరుగులేని ముఖ్యమంత్రులుగా రాజకీయ పీఠాన్ని అధిష్టించిన ముగ్గురు సినీ నటులు

మన తెలుగు నటుడు, విశ్వా విఖ్యాత నట సర్వ భౌముడు ఎన్టీఆర్ వలెనే తమిళ అగ్రనటుడు ఎంజీయార్, జయలలితలు సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా రాణించడమే కాకుండా వినూత్న సంక్షేమ పథకాలతో పేదల పాలిటి దేవుళ్ళయ్యారు. అన్న, అమ్మ అని పిలుచుకునేంత ఆత్మీయతను పొందారు. ఎన్టీఆర్ కూడా తమ సినీ సహచరుడు, స్నేహితుడు కావడం వల్ల తెలుగు రాష్ట్రం పట్ల ఒకింత సానుకూలంగా ఉండేవారు ఎంజీయార్.  అదే పరంపరను జయలలిత కూడా కొనసాగించారు. నిజానికి తెలుగుగంగ ప్రాజెక్టులో కృష్ణా జలాలను మద్రాసుకు ఇవ్వడమే తప్ప రాయలసీమ ప్రయోజనాలను జోడించలేదు. కానీ ఎన్టీఆర్ పట్టుబట్టి రాష్ట్ర ప్రయోజనాలనూ ప్రాజెక్టుకు జోడించారు. అందుకు ఎంజీయార్ కూడా అభ్యంతరాలు పెట్టకుండా సహకరించారు.
ఆ తర్వాత జయలలిత సైతం చంద్రబాబు నాయుడికి అదే విధంగా సహకరించారు.
వీరు ముగ్గురి నాయకత్వం గురించి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజకీయం లోనే కాదు చివరికి అంతిమ యాత్రలో కూడా ఎంజీయార్ వారసురాలిగానే ఆయన మాదిరే పదవిలో ఉండగా తుది శ్వాశ విధించింది జయ.
తోటి నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా జయ అన్న గారిని ఎంతో గౌరవించేది.
తెలుగులో ఆమె ఎక్కువ సినిమాలు చేసిన కథానాయకుడు ఎన్టీ రామారావు గారే. ఆయనతో సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో ఆమె నాయికగా చేశారు. వాటిలో ‘గోపాలుడు భూపాలుడు’, ‘బాగ్దాద్‌ గజదొంగ’, ‘తిక్క శంకరయ్య’, ‘చిక్కడు దొరకడు’, ‘కదలడు వదలడు’, ‘ఆలీబాబా 40 దొంగలు’, ‘కథానాయకుడు’, ‘గండికోట రహస్యం’, ‘శ్రీకృష్ణ విజయం’, ‘శ్రీకృష్ణ సత్య’, ‘దేవుడు చేసిన మనుషులు’ మొదలైన 10 చిత్రాల్లో కథానాయికగా నటించారు జయలలిత. కృష్ణ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘తేనె మనసులు’లో నాయిక పాత్రకు ఆడిషన కోసం వచ్చి విఫలమైన ఆమె ఆ తర్వాత ఆయనతో ‘గూఢచారి 116’, ‘నిలువు దోపిడి’ సినిమాల్లో జంటగా నటించారు. ‘నిలువు దోపిడి’లో ఆ ఇద్దరిపై ఓ యుగళగీతం తీయాలనుకొనీ తీయలేకపోయారు. కారణం కాల్షీట్లు దొరకనంత బిజీగా జయలలిత ఉండటం. కెరీర్‌ చివరలో శోభనబాబుతో చేసే అవకాశం ఆమెకు లభించింది. ఆ సినిమా ‘డాక్డర్‌ బాబు’ (1973). ఇవే కాకుండా జగ్గయ్యతో ‘ఆమె ఎవరు?’, రామకృష్ణతో ‘సుఖదుఃఖాలు’, చలంతో ‘దేవుడమ్మ’ వంటి చిత్రాలను చేశారు. ‘డాక్టర్‌ బాబు’ తర్వాత శోభన, జయలలిత సన్నిహితత్వంపై వదంతులు వచ్చాయి. తెలుగుకు తనను పరిచయం చేసిన దర్శకుడు కె. ప్రత్యగాత్మతోటే చివరి సినిమా ‘నాయకుడు వినాయకుడు’ చిత్రం చెయ్యడం, అందులోనూ అక్కినేని హీరో కావడం గమనార్హం. ఆ తర్వాత తమిళ రంగానికి పరిమితమైన ఆమె రాజకీయాల్లో ఎమ్జీఆర్‌ వారసురాలిగా పేరు తెచ్చుకొని తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తొలిసారి ముఖ్యమంత్రిగా చేసిన కాలంలోనే 1992లో నెల్లూరులో జరిగిన నంది అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డితో పాటు అవార్డులను అందజేశారు.
రాజకీయం లోనే కాదు చివరికి అంతిమ యాత్రలో కూడా ఎంజీయార్ వారసురాలిగానే ఆయన మాదిరే పదవిలో ఉండగా తుది శ్వాశ విధించింది జయ.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts