పక్క దేశాలు సైతం మోడీని ప్రశంశలతో ముంచెత్తుతున్నారు
పొరుగింటి పుల్ల కూర రుచి అని మనకి మన దేశంలో జరిగే మంచి మార్పులు నచ్చవు. ఇదే నోట్ల రద్దు ఏ అమెరికాలోనో చైనాలోనో మరేదైనా దేశంలో జరిగి ఉంటే అది దేశాన్ని నడిపే నాయకుడంటే ఆలా ఉండాలి దమ్ముండాలి ధనియాలుండాలి అని సొల్లు కబుర్లు చెప్తూ శభాష్ అనే వాళ్ళం. ఇప్పుడు మన వరకు వచ్చే సరికి ముందులో అందరు సమర్ధించినా మోడీ వల్లే ఈ డబ్బు కష్టాలు బాధలు అంటూ తిట్టిపోస్తున్నారు.
ఇప్పుడు మనం దర్జాగా అనుభవిస్తున్న ఈ 69 ఏళ్ళ స్వాతంత్య్రం ఊరికే వచ్చిందా??
ఎన్ని ప్రాణాలు బలయ్యాయి ఎంత మంది అభాగ్యులు ఆవేదన చెందారు?
మార్పు ఏది ఊరికే రాదు ఈ రోజు మనం పడే కష్టం రేపటి తరానికి మంచే చేస్తుంది. చూస్తూ ఉందాం ఈ జూదానికి ఫలితం ఏమిటో…??
మనకి తెలియని మన ప్రధాని విలువ పక్క దేశాల నాయకులకి ప్రజలకి మాత్రం బాగా తెలుస్తుంది.
పెద్ద నోట్లను రద్దు చేస్తూ మన భారత ప్రధాని తీసుకున్న నిర్ణయం ‘అత్యంత సాహసోపేతం’ అని చైనా అధికార మీడియా మోడీ నిర్ణయాన్ని ప్రశంసించింది. ఇది ఒక రకంగా ‘జూదం’ లాంటిదని, అది సఫలమైనా, విఫలమైనా దాని నుంచి చైనా పాఠాలు నేర్చుకుంటుందని పేర్కొంది. ఒక వేళ తమ దేశంలో కూడా భారత్ లో లాగా 50, 100 యువాన్ల నోట్లను రద్దు చేస్తే ఎదురయ్యే ప్రభావాలను తాము ఊహించలేమని చైనా అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ తాజా సంపాదకీయంలో రాసింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని అత్యంత గోప్యంగా ఉంచిన విధానాన్ని కూడా ఆ సంపాదకీయం సమర్ధించింది. ‘నోట్లు రద్దు చేస్తున్న విషయాన్ని ముందుగా లీక్ చేస్తే చాలా దారుణమైన ప్రభావాలుంటాయి కాబట్టి దాన్ని అత్యంత రహస్యంగా ఉంచాల్సిందే. ఏదైనా ఒక కొత్త విధానం చేపట్టే ముందు ప్రజల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్న సాధారణ నియమం ఇచట వర్తించదు. నల్లధనాన్ని అరికట్టాలంటే ఇలాంటి పెద్ద సంస్కరణలు ఖచ్చితంగా చేపట్టాలి’ అని ఆ సంపాదకీయం పేర్కొంది. భారత్ లో 90% కి పైగా లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతాయి. కాబట్టి చలామణిలో ఉన్న 85% కరెన్సీ నోట్లని రద్దు చేయడం వల్ల ప్రజల రోజువారీ జీవనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ మీడియా తెలిపింది. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల అవినీతి, షాడో ఆర్థిక వ్యవస్థ మీద గట్టిగా దెబ్బ పడుతుందని, అయితే సామాజిక, రాజకీయ అంశాల సమస్యలను మాత్రం అది పరిష్కరించలేదని వారి దేశ అభిప్రాయాన్ని వెల్లడించింది. అవినీతి మూలాల ఉనికి ఉన్నంత వరకూ సమస్య మళ్లీ మళ్లీ ఉత్పన్నమవుతునే ఉంటుందని అంది. ‘మోదీ భారత ప్రభుత్వ సామర్థ్యం, భారతీయ సమాజం లో ఉన్న సహన స్థాయి మీద గాంబ్లింగ్ ఆడారు. ఈ సంస్కరణ వల్ల మంచి ప్రయోజనాలే కలుగుతాయని కలగాలని ఆయన ఆశిస్తున్నారు. ఫలితాలు ఎలా వచ్చినా ఆయన తన నిర్ణయంతో ముందుకు సాగరు’ అని ఆ సంపాదకీయం పేర్కొంది. ‘సంస్కరణ అనేది ఎప్పుడూ ఒక అసులభమమైన అంశమే. దీనికి చాలా సాహసం ఉండాలి. మంచి ఉద్దేశంతోనే నరేంద్ర మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. అయితే అది విజయవంతం అవుతుందా లేదా అనేది మాత్రం వ్యవస్థ సామర్థ్యం మరియు యావత్ సమాజం అందించే సహకారం మీద ఆధారపడి ఉంటుంది’ అని తేల్చిచెప్పింది.
Related Posts
- జమ్మూలో ఆర్మీ ఆయుధ కేంద్రంపై ఉగ్రవాదుల అట్టాక్
- 2000 నోటుని సైతం రద్దు చ్చేయనున్న మోడీ సర్కారు!!
- ఉభయ సభల్లో గందరగోళం మధ్య ఆమోదం పొందిన ఐటీ చట్టసవరణ బిల్లు
- నిరంతరం రగిలే నిప్పుకణిక.. ప్రపంచచరిత్రలో మీ పేజి ఎప్పటికి సజీవం
- అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్…
- చైనాలో పెళ్లికాని ప్రసాదులు….!!
- ప్రపంచపు చివరి యోధుడు ఫిడెల్ కాస్ట్రో కన్నుమూత..!!
- నల్లడబ్బు నీడలో నేటి భారతం
- జియో యూజర్లు ఈ మాట విన్నారంటే పండుగ చేసుకుంటారు
- చిటికెలో బ్యాంకు బ్యాలన్స్ తెలుసుకుందాం..
- భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచించండి భారతీయులారా
- క్యూలో ఉన్న వారిని కొట్టొద్దు అంటున్న మోడీ
- మళ్ళీ పీఎం మోడీయేనా??
- నోట్ల రద్దుపై విపక్షాలు చేపట్టబోతున్న బంద్ ఫలిస్తుందా???
- కొత్త నోటు రూపురేఖలు మారాయి మరి నాణ్యత సంగతేంటి?
- టీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కేసీఆర్ కుటుంబం అవినీతి అంశంలో ఏనుగులా బాగా బలిసింది…!!

Leave a Reply