పోరాటం విధ్యార్థులది, ఆర్భాటం కెసిఆర్ ది అంటున్న కాంగ్రెస్ నేత
ప్రత్యేక తెలంగాణ పోరులో ఎన్ని ప్రాణాలు కోల్పోయాయో ఎంత నష్టం వాటిల్లిందో మన అందరికీ విదితమే.ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు తెలంగాణ ని చూసిన చిన్న చూపే నేడు ఈ తెలుగు రాష్ట్రాల ఎడబాటుకు ముఖ్య కారణం. మీడియా మొత్తం తెలంగాణా కోసమే సపోర్ట్ చేసింది. ఇప్పుడు విడిపోయి ఎవరికీ వారే యమునా తీరు అయ్యారు. రెండు రాష్ట్రాల సీఎం లు బాగానే ఉన్నారు. కానీ పోరాట సమయంలో నష్ట పోయిన వారు ఎందరో ఉన్నారు. మరి రాష్ట్రం కోసమే తమ బంగారు భవిష్యత్తు వదిలి ప్రాణాలను సైతం త్యాగం చేసిన విద్యార్థుల సంగతేంటి??
కొందరు ఆస్థి నష్ట పోయారు మరి కొందరు విద్యార్థులు ఆవేశంలో భావి తరాల కోసం తమ విలువైన ప్రాణాలనే నష్ట పోయారు. కానీ తెలంగాణా ఫలితం అందరు దర్జాగా అనుభవిస్తున్నారు.
విద్యార్థుల పోరాట త్యాగ ఫలం వల్లే నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఒక సభలో పేర్కొన్నారు.శుక్రవారం కామారెడ్డి లోని తాహెర్ గార్డెన్‌లో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్థి పోరు గర్జన జరిగింది. కేవలం విద్యార్థుల భవిష్య్తతు కోసమే ఈ గర్జన మొదలు పెట్టారు కాంగ్రెస్ నేతలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ ప్రసంగిస్తూ విద్యార్ధుల పోరాటాల వల్ల సీఎం అయిన కేసీఆర్ ఇప్పుడు విద్యార్ధుల భవిష్యత్తును పట్టించుకోవడం లేదు అన్నారు. తెలంగాణ లో నిరంకుశ పాలన జరుగుతుందని కేసీఆర్ మొండి వైఖరి మార్చుకోక పోవడం వల్ల సుమారు 3200 కాలేజీలు మూతపడే దయనీయ పరిస్థితి వచ్చిందని, ఫీజుల కోసం పోరాటం చెయ్యడానికి విద్యార్థులకు అండగా కాలేజీ యాజమాన్యాలు ముందుకు రావాలని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తు ని నాశనం చేస్తే ఊరుకునే ప్రశక్తే లేదని రేపటి భావి భారత పౌరులు వారే అని ఆయన తన మాటలలోని భావంతో వ్యక్త పరిచారు
అలాగే శాసన మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటూ మాట దాటేసిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వీళ్ళ విమర్శలలోను నిజం ఉంది తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు కాస్త విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే బాగుంటుంది.
ఈ ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇప్పట్లో ఇవ్వకపోతే కెసిఆర్ గారికి అగచాట్లు తప్పేలా లేవు. నాణ్యమైన విద్య అందిస్తాం అని ఏ విధంగా ప్రమాణాలు చేసారో అదే విధంగా త్వరగా విద్యార్థులకు వారికి అందాల్సిన రీఎంబర్స్‌మెంట్ అందిస్తే వారి భవిష్యత్తు కి బంగారు బాట వేసినవారు అవుతారు.
ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడం లో కెసిఆర్ ఘనుడే అయినప్పటికీ ఇలాంటి విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా ఉంటే మంచిది. ఆయన మాటలు ఘాటుగానే ఉన్నప్పటికీ ఇలాంటి మంచి పనులు చెయ్యడం లో వెనుకడుగు వెయ్యరు తెలంగాణ చందురుడు. ఇచ్చిన వాగ్ధానాలను మాత్రం తప్పకుండా నెరవేరుస్తారని ఆశిద్దాం..
Leave a Reply