ప్రపంచపు చివరి యోధుడు ఫిడెల్ కాస్ట్రో కన్నుమూత..!!
ఉజ్వలమైన కన్నీళ్ళతోఫిడెల్ కాస్ట్రోకి ఇస్తున్న నివాళి..!!
క్యూబా కొదమ సింహం.. సామ్రాజ్యవాదుల పాలిట సింహ స్వప్నం..
అమెరికాకు కంట్లో నలక పడితే అనేక దేశాలకు కంట్లో నీళ్లు వచ్చే పరిస్థితులు ఉన్నాయి..!!
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అమెరికా ప్రపంచ దేశాలను తన మీద ఆధారపడి బతికేలా చేసుకుంది. కానీ ఒకే ఒక్క దేశం 50 ఏళ్లకు పైగా అమెరికా ఆర్థిక అంక్షలు తట్టుకుని అగ్రగామిగా నిలబడింది.. సేంద్రీయ వ్యవసాయంతో పాటు పేదరికం, యాచకులు లేకుండా ప్రతీ పౌరుడి ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు ప్రభుత్వమే చూస్తోంది..వందశాతం అక్షరాస్యతతో పాటు నిరుద్యోగులు ఒక శాతం లేకుండా చూస్తున్నారు.ప్రపంచంలో అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందుతున్న దేశంగా క్యూబా అమెరికాను మించిపోయింది..
అమెరికాకు కూతవేటు దూరంలో ఉన్న బుల్లి క్యూబా దేశం లాటిన్ అమెరికా దేశాలకు వేగు చుక్కగా మారింది.. ఫెడల్ కాస్ట్రో, చేగోవేరా విప్లవ స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శంగా మారింది.. వారు కలలు గన్న మరో ప్రపంచాన్ని క్యూబా ఆవిష్కరించింది..
నియంతలకు వ్యతిరేకంగా పోరాటం చేసి క్యూబాకు స్వేచ్ఛను ప్రసాదించడమే కాకుండా ప్రపంచానికి ఒక దిక్సూచిగా మార్చిన ఫెడల్ కాస్ట్రో 20 వ శతబ్ధాపు చివరి యోధుడు..
విప్లవ చరిత్రపై చెరగని సంతకం చేశాడు. వయసు మీద పడినా తన పోరాట స్ఫూర్తి, ప్రజలను ప్రేమించే గుణం చివరి వరుకు వదల్లేదు. ప్రపంచంలో ఎక్కువసార్లు హ్యత్యా ప్రయత్నాలు జరిగిన నేతగా ప్రసిద్ధి కెక్కారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 633 సార్లుకు పైగా ఫిడెల్ కాస్ట్రోపై హత్యా ప్రయత్నాలు జరిగాయి. అన్నిసార్లు అతను మృత్యుంజయుడులా బయటపడ్డారు. మన కాలపు చివరి యోధుడైన ఫెడల్ కాస్ట్రో భూగోళంతో తెగతెంపులు చేసుకొని సమస్త మానవాళిని వదిలి వెళ్లిపోవడం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి..!!
ఓ మహా వీరా నీ స్ఫూర్తి మరువలేనిది. పొరుగింటి దేశపు పౌరులతో కూడా పొగడ్తల వర్షం కురిపించుకునే విప్లవ యోధుడా అందుకో అశ్రు నయనాలతో టీజీ న్యూస్ అందిస్తున్న ఈ అక్షర నివాళి_/\_.
.
Leave a Reply