హీరో సుమంత్ చేసిన చిత్రం ‘నరుడా డోనరుడా’ అడ్డంకులు తొలగించుకుంది.
చాలా కాలం గ్యాప్ తీసుకుని అక్కినేని హీరో సుమంత్ చేసిన చిత్రం ‘నరుడా డోనరుడా’. బాలీవుడ్ సూరా హిట్ చిత్రం ‘వికీ డోనార్’ కు తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం అనుకున్న తేదీ ప్రకారం ఈరోజు విడుదల కావాలి. కానీ నిన్న సాయంత్రం నుండి సినిమా శుక్రవారం విడుదకాదని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుధీర్ కు సంబందించిన ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేయడంతో కోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందని, అందుకే సినిమా ఆగిందని, రేపు రిలీజ్ కాదని వార్తలొచ్చాయి.
దీంతో ప్రేక్షకుల్లో సినిమా ఈరోజు శుక్రవారం థియేటర్లలోకి వస్తుందా రాదా అనే డైలమా ఏర్పడింది. కానీ ఈరోజు ఉదయం నుండి సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాకున్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఈరోజు ఉదయం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని ఖచ్చితమైన సమాచారం తెలుస్తోంది. ట్రైలర్లతో, పోస్టర్లతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రంలో సుమంత్ సరసన పల్లవి సుభాష్ హీరోయిన్ గా నటించగా మల్లిక్ రామ్ దీనికి దర్శకత్వం వహించారు.
Leave a Reply