అత్యాధునిక ఫీచర్లతో మైక్రోసాఫ్ట్ పీసీ వచ్చేసింది
మైక్రోసాఫ్ట్ పీసీ వచ్చేసింది. ఆ కంపెనీ చరిత్రలో మొదటి డెస్క్ టాప్ పీసీని ఆవిష్కరించింది. దానికి సర్ఫేస్ స్టూడియో అని పేరు పెట్టింది. అత్యాధునిక ఫీచర్లతోపాటు ఆకట్టుకునేలా డిస్ప్లే ఉంది. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు, వీడియో ఎడిటర్లకు ఇది బాగా సూటవుతుందని అంటున్నారు నిపుణులు. ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. స్క28 అంగుళాల అల్ట్రాహెచ్‌డీ 4.5 టచ్ స్ర్కీన్, అత్యంత పలచుని స్ర్కీన్‌తో 32 జీబీ ర్యామ్, ఒక టెగాబైట్ హార్డ్ డిస్క్, ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్ ఉన్నాయి. హార్డ్ కోర్ ఎన్- వీడియో జీటీఎక్స్ 980 గ్రాఫిక్ కార్డు, వైఫై, బ్లూటూత్, ముందు 5, వెనుక 1080 మెగాఫిక్సెల్ కెమెరా, ట్యాబ్లెట్‌లోకి మార్చే సౌకర్యం దాని ప్రత్యేకతలు. ఇన్ని ప్రత్యేకతలతో వస్తున్న ఈ పీసీ ధర కూడా ఎక్కవే. ఇండిన్ కరెన్సీలో అయితే 2లక్షలకు పైమాటే. ఈ పీసీకి ప్రీ ఆర్డర్లను కూడా కంపెనీ ఆహ్వనిస్తోంది.
Leave a Reply