మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఓ అద్భుత క్రీడాకారుడు: సచిన్
ఇంటర్నెట్‌డెస్క్, హైదరాబాద్: భారత క్రికెట్ చరిత్రలో పరుగుల కెరటంగా పేరుగాంచిన మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు మాజీ, తాజా క్రికెటర్లు , బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారత జట్టు తరఫున వీవీఎస్ ఆడిన తీరును, ఆయన ప్రవర్తనను గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాల్ని అభిమానులతో పంచుకున్నారు. సొగసరి బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన లక్ష్మణ్ ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌లో సృష్టించిన పరుగుల సునామీ (281) గుర్తు చేసుకున్నారు. ‘లక్ష్మణ్ ఓ అద్భుతమైన క్రీడాకారుడు. దేశానికి ప్రత్యేకంగా ఏదో ఒకటి చేయాలని నిత్యం పరితపించే వ్యక్తి’ అని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కొనియాడారు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, టీమ్ ఇండియా కోచ్ అనిల్ కుంబ్లే సహా పలువురు ఆటగాళ్లు లక్ష్మణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వీవీఎస్‌తో తాము కలిసి ఉన్న ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Leave a Reply