స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాస్త పెంచిన గ్లామర్ డోస్!
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగి, దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించేసిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా చేసిన తమిళ చిత్రం ‘కావలై వెండం’. ఈ చిత్రం తెలుగులో సైతం ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో విడుదలవుతోంది. తెలుగులో గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేకపోవడం వలన ఈ సినిమా విజయం సాధించాలని కాజల్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటోంది.
అలాగే సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం కాజల్ ఈ సినిమాలో గ్లామర్ డోస్ కూడా కాస్త పెంచినట్టు తెలుస్తోంది. మునుపటి సినిమాల్లో కన్నా ఈ సినిమాలో ఈ బ్యూటీ కాస్త హాట్ గా కనిపించి అభిమానులను హుషారెత్తించనుందట. దీంతో అభిమానులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీకే డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని డి. వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు సమర్పిస్తున్నారు. ఈ మధ్యే ఆడియో విడుదల జరుపుకున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ నెలలో తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
Leave a Reply