పరిణయానికి సిద్దమైన దేవసేన… ఇంతకీ వరుడెవ్వరు??
సౌత్ లో ఏ దర్శకుడైనా లేడీ ఓరియంటెడ్ చిత్రం తీయాలి అనుకుంటే వారికి మొదటి ఆప్షన్ అనుష్కనే. ఇటు భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి2’లో నటిస్తూనే, అటు ‘సింగం3’, ‘బాగమతి’, ‘ఓం నమో వేంకటేశాయ’ వంటి చిత్రాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న అనుష్క గురించి ఒక షాకింగ్ వార్త బయటకొచ్చింది. అదే ఆమె పెళ్లి గురించి. అందులో షాకింగ్ ఏముంది? ఈ వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా అనుకుంటే పొరపాటే. Anushka Shetty’s marriage news
తాజాగా వచ్చిన వార్త ఏంటంటే..ఇప్పటికే మూడు పదులు వయసు దాటిన బొమ్మాలికి పెళ్లి చెయ్యాలని ఆమె తల్లిదండ్రులు ఎప్పటినుంచో అనుకున్నప్పటికీ, సరైన వరుడు దొరకక వెయిట్ చేశారు. ఇక ఇప్పుడు మాత్రం సరిగ్గా ఈ దేవసేనకి కరెక్ట్ గా సెట్ అయ్యే వరుడు కనిపించడం, అతను అనుష్క ఫ్యామిలీకి దగ్గరి బంధువు కావడమే కాకుండా, జేజమ్మ పేరెంట్స్ ఉంటున్న బెంగళూరు లోనే ఉంటున్నాడట. దీంతో అసలేమాత్రం ఆలోచించకుండా, వెంటనే పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఇక చివరిగా అతన్ని అనుష్క కూడా చూసి ఫైనల్ చేస్తే ఒక పనైపోతుంది.
ఇక వీరి పెళ్లిని బెంగళూరు లోనే జరపబోతున్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సమ్మర్ లోనే అనుష్క మెడలో మూడుముళ్ళు పడటం ఖాయం అంటున్నారు. ఇక ఈమెను చేసుకోబోయే వ్యక్తికి టాలీవుడ్ తో కూడా పరిచయం ఉండటంతో, ఇప్పు
Leave a Reply