అంజనా పుత్రుని దర్శకత్వంలో వసుంధరా పుత్రుడు వస్తున్నాడా??
టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకత ఉంది. వారు నటించే సినిమాలు చాలా పవర్ ఫల్ గా ఉంటాయనడంలో సందేహం లేదు. అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు నంచి, ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు నట వారసత్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇదే ఫ్యామిలీ నుంచి మరో కుర్రాడు వెండి తెరపై వెలగబోతున్నట్టు తెలుస్తోంది. ఆయనెవరో ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది. ఎస్..నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ. ఈ చిన్నోడిని సినిమాల్లోకి తీసుకురావాలని గత కొన్ని రోజులుగా కథలపై దృష్టి పెట్టిన బాలయ్యకు, మోక్షజ్ఞ బాడీ లాంగ్వేజ్ కే సరిపడే స్టోరీ దొరకలేదట.
దీంతో బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అదేంటంటే..ప్రస్తుతం తనతో హిస్టారికల్ చిత్రం అయిన ‘గౌతమీ పుత్రా శాతకర్ణి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్న క్రిష్ చేతనే నందమూరి యువరాజును హీరోగా పరిచయం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే క్రిష్ తో చర్చలు జరిపిన బాలకృష్ణ, తొందరగా స్క్రిప్ట్ పని కూడా పూర్తి చెయ్యమని చెప్పాడట. ఎలాగో శాతకర్ణి సంక్రాంతికి వచ్చేస్తుంది కాబట్టి, ఆ వెంటనే తన కుమారుడుకు కథ రెడీ చేసే పనిలో ఉండమని చెప్పాడట.
అయితే..నందమూరి ఫ్యామిలీకి కలిసొచ్చే యాక్షన్ సినిమాతో కాకుండా, ఒక క్లాస్ లవ్ స్టోరీతో మోక్షాను చూపించమని కూడా సలహా ఇచ్చాడట బాలయ్య. ఈ లెక్కన వచ్చే ఏడాది ఈ నందమూరి లిటిల్ స్టార్ సినిమా స్టార్ట్ కాబోతుందని అంటున్నారు ఫిలిం నగర్ వర్గాలు. ఇదే గనుక నిజమైతే అభిమానులకు పండగే పండుగ.
Leave a Reply