అమ్మకి అశ్రునయనాలతో నివాళులు | Telugu News
గుడ్డు ఉడకాల్సిన సమయం ఎంత?-రేవంత్ కు పంచ్ ఇచ్చిన బాలయ్య-ఏపీలో రద్దు కానున్న ఎంసెట్-నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు-ఉద్దానం బాధితులపై పూర్తిస్థాయిలో స్పందించిన ముఖ్యమంత్రి-మనకి ప్రాణభిక్ష పెట్టిన సైనికుడు బిచ్చమెత్తుకుంటున్నాడు-సంక్రాంతికి సాంప్రదాయం లోపిస్తోందా??-ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం మన ఖర్మ-ఉద్దానం పాపం ఎవరిది?-మద్యం అమ్మకాలపై గళం విప్పిన హర్మన్ సింగ్ సిద్ధూ

అమ్మకి అశ్రునయనాలతో నివాళులు

కనీ వినీ ఎరుగని రీతిలో మగాడి అహం వంచి, తల దించి పాదాభివందనం చేయించుకున్న ఘనత నీది

దుశ్యాసన, కీచక విక్రుతాలను ఏ కృష్ణుడి సాయం లేకుండా చీల్చి చెండాడిన ధీరత్వం నీ తెగువది

ఆడ శక్తి యొక్క అగ్నితత్వం ఆకాశానికి ఎగిసేలా పోరాడిన జ్వాలా రూపం నీ నిర్భయానిది

అమ్మ అన్న పిలుపుని అమరత్వంగా మలిచిన లాలన నీ పాలనది

చిరునవ్వులతోనే చిటపటలు రువ్వగల చాతుర్యం నీ రాజకీయ చతురతది

మగువ అంటే నీలానే ప్రజ్వలితలా మేరవాలని ప్రతి మహిళా ఆదర్శంగా తీసుకుని నడిచే దర్పం నీ గాంభీర్యానిది

హుందాతనం, నిండుదనం, వీరత్వం, విప్లవం కలిసి అవతరించినట్టు వుండే సింహ రూపం నీ రాజసానిది

ఎవరు ఝాన్సీఎవరు రుద్రమ్మ ఎవరు ఎవరెవరో మాకు తెలీదు మరో నారీమణి అందరినీ కలగలుపుకుని నీలోనే చూసాం నువ్వే మాకు తెలిసిన ఈ తరం వీర నారివి

పేరులోనే జయం వున్న నిలువెత్తు విజయ నిర్వచనానివి

నీకెక్కడిది మరణం అనేది అది తీసుకు పోగలదా నిన్ను మా గుండెల నుండి నువ్వు ప్రతి మదిలో కొలువైపోయిన దీపానివి
నీ ఆదర్శం ప్రతి చోటా అడుగులు ముద్రలు వేసే వుంది నీ అమరత్వం ప్రతి గుండె శబ్దంలో సాక్ష్యంగా మార్మ్రోగుతూనే వుంటుంది నువ్విచ్చిన చైతన్యం ప్రతి అభిమాని నెత్తుటి బొట్టులో విప్లవ గీతం ఆలపిస్తుంటుంది

నువ్వొక స్పూర్తివి
నువ్వొక జ్యోతివి
నువ్వొక కీర్తివి
నువ్వొక ఖ్యాతివి
నువ్వొక మహోన్నత శక్తివి
నువ్వొక మహా యుక్తివి
నువ్వొక ఆత్మ గౌరవానికి ప్రతీకవి

ఊపిరి ఆగిపోయినా
గుండె స్పందించకపోయినా
గొంతు మూగబోయిన
ప్రాణం ప్రయాణం అయిపోయినా
యుగ యుగయుగాలుగా బ్రతికగలిగిన మహోన్నత మహా తేజస్సువి

నీకు లేదు మరణం
నువ్వు కోట్ల గుండెల్లో అమరం
నీకు లేదు మరణం
నువ్వు కోట్ల గుండెల్లో అమరం !!

ఆది శక్తికి టీజీన్యూస్ అందిస్తున్న అక్షర నివాళులు_/\_

Related Posts

 • పెట్రోల్ పై 6రూ.ల వడ్డన
 • నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు
 • 33 ఏళ్ల తర్వాత మళ్లీ తిరుపతిలో 104వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సు
 • జయలలిత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు…
 • ఈ నగదురహిత లావాదేవీ అవసరమా ?
 • అమ్మ అస్తమయంతో శోక సంద్రంలో తమిళనాడు
 • చంద్రబాబు కన్వీనర్‌గా 13 మందితో నీతి ఆయోగ్‌ కమిటీ
 • నల్లకుబేరుల మెడకు పూర్తిగా ఉచ్చు బిగించిన కేంద్ర ప్రభుత్వం
 • కరుణను తట్టుకోవాలంటే మోదీ సాయం తప్పదు…
 • దొంగనోట్ల పుట్టుక
 • 2000 నోటుని సైతం రద్దు చ్చేయనున్న మోడీ సర్కారు!!
 • తమిళనాడు ఉక్కు మనిషి ఇక లేదు
 • పక్క దేశాలు సైతం మోడీని ప్రశంశలతో ముంచెత్తుతున్నారు
 • ఏంటి ఈ దరిద్రమైన లాజిక్
 • అమ్మ మృతి వెన‌క భారీ కుట్ర
 • ప్రజల కష్టాల సంగతేంటి??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts

 • పెట్రోల్ పై 6రూ.ల వడ్డన
 • నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు
 • 33 ఏళ్ల తర్వాత మళ్లీ తిరుపతిలో 104వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సు
 • జయలలిత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు…
 • ఈ నగదురహిత లావాదేవీ అవసరమా ?
 • అమ్మ అస్తమయంతో శోక సంద్రంలో తమిళనాడు
 • చంద్రబాబు కన్వీనర్‌గా 13 మందితో నీతి ఆయోగ్‌ కమిటీ
 • నల్లకుబేరుల మెడకు పూర్తిగా ఉచ్చు బిగించిన కేంద్ర ప్రభుత్వం
 • కరుణను తట్టుకోవాలంటే మోదీ సాయం తప్పదు…
 • దొంగనోట్ల పుట్టుక
 • 2000 నోటుని సైతం రద్దు చ్చేయనున్న మోడీ సర్కారు!!
 • తమిళనాడు ఉక్కు మనిషి ఇక లేదు
 • పక్క దేశాలు సైతం మోడీని ప్రశంశలతో ముంచెత్తుతున్నారు
 • ఏంటి ఈ దరిద్రమైన లాజిక్
 • అమ్మ మృతి వెన‌క భారీ కుట్ర
 • ప్రజల కష్టాల సంగతేంటి??